Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యను అతికిరాతకంగా చంపిన ఘటన తెలకపల్లి మండలం గౌరారంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని గౌరారంకు చెందిన చెన్న రాములుకు ఎల్లమ్మ తో ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహంతో భార్యను తీవ్రంగా కొట్టి, గొంతు నిలిమి చంపాడు. అయితే తన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు.కాని అనుమానం వచ్చిన మృతురాలు తల్లి సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్త రాములు పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.