Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ (ఇండియా) ఎండీ పదవికి అజిత్ మోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు మేటా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అజిత్ మోహన్ ఇంకో కంపెనీలో చేరుతున్నారని, అందుకే ఆయన రాజీనామా చేస్తున్నట్లు మేటా వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సన్ పేర్కొన్నారు. కాగా అజిత్ మోహన్ ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ స్నాప్ లో జాయిన్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అజిత్ మోహన్ 2019లో ఫేస్ బుక్ ఇండియా ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎండీగా ఉన్న కాలంలోనే వాట్సాప్, ఇన్ స్టాగ్రాం ఫేస్ బుక్ లో విలీనమయ్యాయి. దీంతో భారత్ నుంచి దాదాపు 200 మిలియన్ యూజర్లు ఫేస్ బుక్ లో చేరారు.