Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలుగు - తమిళ భాషల్లో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి ఒక సినిమా చేస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాకి 'వారసుడు' అనీ .. తమిళంలో 'వరిసు' అనే టైటిల్స్ ను ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. తాజాగా తమిళ వెర్షన్ 'వరిసు' నుంచి ఫస్టు సింగిల్ కి సంబంధించిన ప్రోమోను వదిలారు. 'రంజితమే .. రంజితమే' అంటూ ఈ పాట సాగుతోంది. జోరుగా హుషారుగా సాగే ఈ బీట్ కి విజయ్ ఒక రేంజ్ లో స్టెప్స్ వేశాడనే విషయం ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. పూర్తి సాంగును ఈనెల 5న రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ సినిమాలో విజయ్ జోడీగా రష్మిక అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శరత్ కుమార్ .. శ్రీకాంత్ .. స్నేహ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.