Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాల్పుల ఘటన నుంచి గాయాలతో బయటపడిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించారు. దేవుడు తనకు మరో జన్మ ప్రసాదించారని చెప్పారు. మరోవైపు దాడికి పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ కారణమని ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. వీరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పుల ఘటనను పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఖండించారు. పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పుల ఘటనను ఖండించారు. ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటు లాహోర్ ఆస్పత్రిలో ఇమ్రాన్ ఖాన్‌కు చికిత్స అందించారు. ఇమ్రాన్ రెండు కాళ్లకూ బుల్లెట్ గాయాలయ్యాయని సమాచారం. ఘటనలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. ఒకరు చనిపోయారు. వజీరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఇమ్రాన్‌పై ఇద్దరు అంగతకులు కాల్పులు జరిపారు. వీరిలో ఒకరిని పీటీఐ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.