Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఒంగోలు నుండి హైదరాబాద్ బి.ఎన్ నగర్‌కు వస్తుండగా పెద్ద అంబర్పేట్ వద్ద ఆగివున్న లారీని షిప్ట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాదచారులతో సహా.. కారులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను స్థానికులు హయత్ నగర్ మాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. ఒంగోలులో తమ బంధువుల చావుకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన బాధితులు ఆరుగురు బి.ఎన్ రెడ్డి నగర్ కు చెందిన వీరన్నారాయణ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.