Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తిరుమల శ్రీవారి దేవాలయం మూత పడనుంది. ఈనెల 8వ తేదీన చంద్రగ్రహణం ఉంది. ఈ తరుణంలోనే ఆరోజు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నారు. గ్రహణం ముగిశాక వైకుంఠం రెండు నుంచి భక్తులను అనుమతిస్తారు. మంగళవారం మధ్యాహ్నం పూట 2.39 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 6.27 గంటల మధ్య చంద్రగ్రహణం ఉండే అవకాశం ఉంది. కాగా ఆరోజు 8.40 గంటల నుంచి 7.20 గంటల వరకు ఆలయం మూసి వేయబడనుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులు తమ దర్శనాల తేదీలను మార్చుకోవాలని టీటీడీ పేర్కొంది.