Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో బాధపడుతున్న 22 ఏళ్ల రుషిని హుటా హుటీన ఆస్పత్రికి తరలించి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రాజేంద్రనగర్ డిపోకు చెందిన బస్సు (ఎపి 11జెడ్ 6324) (142/1) రూటులో వెళుతుండగా రిషీత్(22)అనే యువకుడు సికింద్రాబాద్ వెళ్లడానికై మెహిదీపట్నంలో బస్సు ఎక్కారు. బస్సుఎక్కిన కొద్దిసేపటికే రుషీత్ వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనిని గమనించిన బస్ కండక్టర్ ఎ. కవిత, డ్రైవర్ షర్పుద్దీన్ వెంటనే డిపో అధికారులకు సమాచారం అందించి సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.డాక్టర్లు రుషీత్‌ను పరీక్షించి గుండెపోటుగా గుర్తించి వైద్యం అందించారు. రుషీత్‌ను ఆదుకున్న డ్రైవర్, కండక్టర్‌లను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు.