Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఓ వ్యక్తి మద్యం తాగుతున్నాడు. మధ్య మధ్యలో మంచింగ్కి ఆమ్లెట్ తినాలనుకున్నాడు. తన భార్యను ఆమ్లెట్ వేయమని అడిగాడు. ఆమె తన భర్త కోసం వేడివేడిగా స్పైసీ ఆమ్లెట్ రెడీ చేసింది. మందు తాగుతూ మధ్య మధ్యలో కాస్త ఆమ్లెట్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. అకస్మాత్తుగా ఆమ్లెట్ అతడి గొంతులో ఇరుక్కుపోయింది. అంతే.. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. భూపాల్ రెడ్డి మృతితో అతడి కుుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.