Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మల్: సోన్ మండలంలోని కడ్తాల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గర్తు తెలియని వాహనం..ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అమీర్(22), బషీర్(22)గా పోలీసులు గుర్తించారు.