Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్నాడు: నరసరావుపేట జిల్లా కోర్టు ఆవరణలో మృతదేహం కలకలం రేపుతోంది. మృతుడు చిలకలూరిపేట కు చెందిన మహబూబ్ శుభానిగా గుర్తించారు. కుటుంబ ఆస్తి తగాదాల నేపథ్యంలో సివిల్ కేసు వాయిదా నిమిత్తం 2న సుభానీ కోర్టు హాజరయ్యాడు. రెండు రోజులు క్రితం నుంచి సుభాని కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. కాగా కోర్టు ఆవరణలో శుభాని ద్విచక్రవాహనం లభ్యమవడంతో పోలీసులు అక్కడ గాలించగా మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.