Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని అశ్వారావుపేట మండలం అచ్చుతాపురం క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై కుంజా వెంకటేశ్వరరావు (36) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మొద్దులగుడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.