Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాకిస్థాన్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గురువారం వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీని కేంద్రంగా చేసుకొని ఇమ్రాన్ ఖాన్ పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ కు బుల్లెట్ గాయం అయింది. ఆస్పత్రిలో కోలుకుంటున్న ఇమ్రాన్ కు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకున్న ఇబ్తిసామ్ హసన్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇబ్తిసామ్ హసన్ ను తమ భుజాలపై ఎత్తుకొని ఊరేగించారు. ఇమ్రాన్ ఖాన్‌పై దాడిని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై పాక్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పంజాబ్ చీఫ్ సెక్రటరీ నుంచి నివేదిక కోరవలసిందిగా అంతర్గత మంత్రి రాణా సనావుల్లాకి ఆదేశాలు జారీ చేశారు.