Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రోజు రోజుకు సైబర్ నేరగాళ్ళ ఆటలు ఎక్కువవుతుంది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని సైబర్ నేరగాడు ఓ యువతికి వల వేశాడు. నగరంలో విఠల్‌వాడిలో నివసిస్తున్న పూజ జైన్ ఓఎల్‌ఎక్స్‌లో ఓ ప్రకటనలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామన్నా దాన్ని చూసి ఆశ పడి అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంది. వారు పంపిన లింక్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసింది. సైబర్ నేరగాడు కొంత నగదు చెల్లించాలని చెప్పడంతో నమ్మిన పూజ జైన్ పలు దఫాలుగా మొత్తం రూ. 40 వేలు దాకా పంపినట్లు తెలుస్తుంది. తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పదన రాకపోవడం, ఫోన్ స్విచాఫ్ రావడం గ్రహించి మోసపోయినట్లుగా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.