Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పీహెచ్‌డీ, అసిస్టెంట్ లెక్చర్‌షిప్ అర్హత కోసం నిర్వహించిన యూజీసీ నెట్ ఫలితాలను ఆధికారులు శనివారం విడుదల చేయనున్నారు. యూజీసీ నెట్ పరీక్షను అక్టోబర్ 8, 10, 11, 12, 13, 14 తేదీల్లో దేశవ్యాప్తంగా ఎన్‌టీఏ నిర్వహించింది. నవంబర్ 5న పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అభ్యర్థులు www.ugcnet.nta.nic.in www.ntaresults.nic.in వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.