Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడిలైడ్: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 35 రన్స్ తేడాతో నెగ్గింది న్యూజిలాండ్. ఈ విక్టరీతో గ్రూప్ 1లో న్యూజిలాండ్ ఏడు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల ఆధారంగా గ్రూప్‌లో టాప్ ఎవరు నిలుస్తారో తెలుస్తుంది. న్యూజిలాండ్ దాదాపు సెమీస్‌కు చేరినట్లు కనిపిస్తున్నా.. ఆ రెండు మ్యాచ్‌లపై తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆసీస్, ఇంగ్లండ్ నెగ్గితే ఆ జట్లు కూడా ఏడు పాయింట్లతో సమం అవుతాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ పరిగణలోకి తీసుకుంటారు. కానీ న్యూజిలాండ్ దాదాపు తన సెమీస్ బర్త్‌ను ఖరారు చేసుకున్నట్లే కనిపిస్తోంది.