Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దపల్లి: తెల్ల బంగారంగా పిలవబడే పత్తికి మార్కెట్‌లో అత్యధిక ధర పలుకుతుంది. ముఖ్యంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మున్నెన్నడూ లేనివిధంగా శుక్రవారం అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 8,410 ధర పలకడం విశేషం. గురువారం ఇదే మార్కెట్‌లో క్వింటాల్ ధర 8,300 రాగా ఈరోజు మరో రూ. 110 అధనంగా ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.