Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ ఇటీవల తన మాజీ భర్త జానీడెప్ తో కోర్టు వివాదంలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ లో తన ఖాతాను డిలీట్ చేసేసిందనే ప్రచారం జరుగుతుంది. అంబర్ హెర్డ్ ఒకప్పుడు టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తో కొంత కాలం పాటు సహ జీవనంలో చేశారు, ఆ తర్వాత వీరు ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజా పరిణామం ఏమిటంటే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడంతో ట్విట్టర్ లో తన ఖాతా కొనసాగించడం అంబర్ కు నచ్చలేదా? లేక ఆమె తన ఖాతాను తొలగించుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పూర్తిగా డిలీట్ చేసిందా? లేక ఆమె ఇనాక్టివ్ లో ఉంచిందా..? లేక అంబర్ అకౌంట్ ను ఎలాన్ మస్క్ డీయాక్టివేట్ చేశాడా? అనేది నెటిజన్ల మదిలో తలెత్తుతున్న ప్రశ్నలు. అసలు విషయం ఏంటన్నది తెలవాల్సివుంది.