ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభ:రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో మూడు రోజుల్లో తెలంగాణలో ముగియనుంది.ఈ సందర్బంలో ఈ నెల 7న బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాహుల్ పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో టి.పి.సి.సి చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని అన్నారు. ఇక ఈనెల 7వ తేదీన రాత్రి దెగ్లూరు లో రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టనుంది.