Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జనసేనాని పవన్ కల్యాణ్ రేపు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామానికి రానున్నారు. దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ కల్యాణ్ ఈ రాత్రికి మంగళగిరి చేరుకుని, రేపు ఉదయం ఇప్పటం గ్రామ ప్రజలను కలుస్తారని వెల్లడించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూలుస్తున్నారని నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా, ఇదే అంశంపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తమకు ఓటు వేయని వారిని శత్రువుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఈ ఉదయం నుంచి జరుగుతున్న అరాచకమే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.