Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సెలవుపై ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ నదిలో శవమై తేలాడు. కన్నవాళ్లకు పుత్రశోకం మిగిల్చాడు. కతిహార్ జిల్లా మనిహారి బ్లాక్‌లోని ఓ గ్రామానికి చెందిన విశ్వల్ కుమార్ (22) ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఛట్ పండుగ నేపథ్యంలో ఇటీవల సెలవుపై ఇంటికొచ్చాడు. గత సోమవారం స్నేహితులతో కలిసి గంగానదిలో ఈతకు వెళ్లాడు. అయితే, నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కొట్టుకుపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించి విశ్వల్ కుమార్ కోసం గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ ఉదయం ఆమ్దాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని శవం నది నీళ్లలో తేలింది. విశ్వల్ తల్లిదండ్రులను అక్కడి తీసుకెళ్లి శవాన్ని చూపించడంతో తమ కుమారుడేనని గుర్తించారు. దాంతో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి మృతదేహాన్ని వారికి అప్పగించారు.