Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈనెల నేడు, రేపు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు హెల్త్ యూనివర్సిటీ రెండో విడత ప్రవేశాలకు నోటిపికేషన్ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవి ద్యాలయం పరిధిలోని కళాశాలలకు, నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు వెబ్‌కౌన్సెలింగ్‌లో హాజరుకావాలని సూచించారు. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈనెల 5న శనివారం ఉదయం 8 గంటల నుంచి 6న ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలలవారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.