Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాహుల్ యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ కాన్వాయ్ ఓ కానిస్టేబుల్ కాలుపై నుంచి వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ శివకుమార్ కాలు విరిగింది. పాపన్న పేట పోలీస్ స్టేషన్‌లో శివకుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.