Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ-మునుగోడు: తెలంగాణాలో ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగిన విషయం మనకు తెలిసిందే. ఈ ఉప ఎన్నిక కారణంగా వందల కోట్ల మద్యం మునుగోడుకి చేరింది. బైపోల్ షెడ్యూల్ మొదలు ఎన్నిక జరిగే వరకు నెల రోజుల వ్యవధిలో మునుగోడులో దాదాపు రూ.300 కోట్ల మద్యం తాగారు. చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మద్యం మునుగోడుకు సరఫరా అయింది. రాష్ట్రంలో సెప్టెంబర్లో రూ.2,700 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, అక్టోబర్లో రూ.3,037 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ లెక్కల్లో తేలింది. దాదాపుగా రూ.300 కోట్లకు పైగా సేల్స్ పెరిగాయి. ఈ ఏడాదిలో ఇవే రికార్డు స్థాయి సేల్స్ అని అధికారులు ప్రకటిస్తున్నారు. ఉప ఎన్నిక వల్ల కొన్ని జిల్లాల్లో సేల్స్ పెరిగాయని, ఆ మద్యమంతా మునుగోడుకు సరఫరా అయిందని పేర్కొంటున్నారు. అక్టోబర్ 5న దసరా ఉన్నప్పటికీ, పండుగకు సంబంధించి మద్యం లిఫ్టింగ్ అంతా సెప్టెంబర్ నెలాఖరులోనే జరిగిందని చెప్పారు. కాగా, లిక్కర్ సేల్స్ ఇన్ కమ్ లో 85 శాతానికి పైగా సర్కార్ ఖజానాకే జమ అవుతోంది. దీంతో ఉప ఎన్నిక కారణంగా సర్కార్ కు ఆదాయం కూడా పెరిగినట్లు తెలుస్తుంది.