Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యతో 'లాల్ సలామ్' అనే సినిమా చేస్తున్నట్లు లైకా ప్రొడక్షన్ తాజాగా ప్రకటించింది. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో మంటల్లో కాలిపోతున్న క్రికెట్ హెల్మెట్‌ని చూపించారు. అంతేకాకుండా హెల్మెట్ పక్కన బాల్, వికేట్ బెల్స్ పడిఉండటం పోస్టర్‌లో కనిపిస్తుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. పోస్టర్‌తోనే చిత్రబృందం సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.