Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్ తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా ఎప్పటిలాగే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది. యాజమాన్య బాధ్యతలు స్వీకరించిన మస్క్ వారం రోజుల్లోనే అందులో పని చేస్తున్న ఉద్యోగులకు భారీ షాకిచ్చాడు. ట్విట్టర్‌లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం సిబ్బందిని తొలగించాడు. దీంతో కొందరు ఉద్యోగులు ఆయన నిర్ణయంపై మండిపడుతూ కోర్టులను కోర్టులను ఆశ్రయిస్తున్నారు. భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎలాన్ మస్క్ బలమైన కారణం దృష్ట్యానే ఈ పని చేసినట్టు వెల్లడించాడు. ట్విట్టర్ నష్టాల్లో పయనిస్తుందని మస్క్ తెలియజేశారు. సంస్థ రోజుకు దాదాపు 4 మిలియన్ డాలర్లను నష్టపోతుందని, నష్ట నివారణ చర్యల్లో భాగంగానే దాదాపు 50% (సుమారు 3,700 మందికి)పైగా ఉద్యోగులను తొలగించినట్టు తెలిపాడు. ఉన్నపళంగా తొలగించినా ఆ ఉద్యోగులకు మాత్రం అన్యాయం చేయలేదని వెల్లడించాడు. తొలగించిన ప్రతి ఉద్యోగికీ మూడు నెలల పరిహారాన్ని అందించనున్నట్టు తెలిపాడు. ఇది చట్టబద్ధంగా అందే దానికంటే 50% ఎక్కువ అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక పోతే ట్విటర్ ఖాతాదారుల నుంచి బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.660) రుసుము వసూలు చేయనున్నట్లు ఈ వారంలో ప్రకటించిన విషయం తెలిసిందే.