Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానం సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడుని ఉచితంగా దర్శించుకునేందుకు రెండు స్లాట్లు ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వీరికి దర్శనభాగ్యం కల్పించనున్నది. అయితే సీనియర్ సిటిజన్లు ఫొటో ఐడీతో వయస్సు రుజువును తెలియజేస్తు తిరుమలలో ఎస్ 1 కౌంటర్‌లో దరఖాస్తు సమర్పించాలని వెల్లడించింది.
ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా మంచి సీటింగ్ తో కంపార్టుమెంట్ ను, ఆహారం అవసరమైన సీనియర్ సిటిజన్స్‌కు లోపల వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం , వేడి పాలు ఉచితంగా అందిస్తామని టీటీడీ వెల్లడించింది. రూ.20 చెల్లించి రెండు లడ్డూలను పొందవచ్చని, ఎక్కువ లడ్డూల కోసం ఒక్కో లడ్డుకు రూ. 25 చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారును కూడా అందుబాటులో ఉంచామని తెలియజేసింది. సీనియర్ సిజిజన్‌లు దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. స్లాట్ విధానం వల్ల భక్తులు 30 నిమిషాల్లోపు దర్శనం నుంచి బయటకు రావచ్చని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు హెల్ప్‌డెస్క్ తిరుమల 08772277777 అనే ఫొన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.