Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండలోని బ్రిడ్జిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ను లారీ ఢీకొనడంతో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.