Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీహార్‌కు చెందిన ఓ యువకుడు ఔరంగాబాద్‌లోని గయా రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించాడు. రైల్వే సిబ్బందికి, సాటి ప్రయాణికులకు చెమటలు పట్టించాడు. గయా రైల్వే స్టేషన్‌లోని ఓ యువకుడు అకస్మాత్తుగా రైలు పైకి ఎక్కాడు. దీంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. రైలులోని ప్రయాణికులంతా బయటకు వచ్చారు. వెంటనే ఆ యువకుడు రైలు మీదుగా వెళ్తున్న హైవోల్టేజీ వైరును తాకేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి జనం మరింత షాకయ్యారు. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై కరెంట్ కట్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
డెహ్రీ-ధన్‌బాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 4:15 గంటలకు గయా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఓ యువకుడు రైలు టాప్ పైకి ఎక్కాడు. రైలు మీదుగా వెళ్తున్న హైవోల్టేజీ వైరును తాకేందుకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన వెంటనే స్టేషన్ మాస్టర్, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఎలక్ట్రికిసటీ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేసి కరంట్ కట్ చేయించారు. వెంటనే కిందకు దిగిరావాలని ఆ యువకుడిని కోరారు. కానీ అతను కిందకు దిగలేదు. కరెంట్ తీగను పట్టుకుని అలా ఉండిపోయాడు. ఎంతో ప్రయత్నం తరువాత, అతని దృష్టిని మళ్లించి పోలీసులు అతడిని కిందకు దించి రైలును పంపించారు. ఆ యువకుడి గొడవ వల్ల దాదాపు 15 నిమిషాలకు పైగా రైలు స్టేషన్‌లోనే నిలిచిపోయింది. కాగా, మానసికంగా అనారోగ్యంగా ఉన్న ఆ యువకుడిని పోలీసులకు అప్పగించినట్టు స్టేషన్ మాస్టర్ తెలిపారు.