Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత వపన్ కల్యాణ్ పర్యటన హైటెన్షన్ మధ్య కొనసాగింది. రోడ్డు విస్తరణ కోసం ఇళ్లు కోల్పోయిన బాధితులను పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ గూండాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు. సజ్జల మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని చెప్పారు. తనకు మద్దతిచ్చేవారి ఇళ్లను కూలుస్తారా అని మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యాలపై ఇక నుంచి తమ పోరాటం సాగుతుందని అన్నారు. వైసీపీ వాళ్లు చొక్కా పట్టుకుంటే చెప్పు తీసుకుని కొట్టండని జనసైనికులకు సూచించారు. ఇకపై పద్ధతిగా రాజకీయం చేస్తే తాము కూడా అలాగే వెళ్తామని... దాడులు చేస్తే తాము కూడా తేల్చుకుంటామని వైసీపీని హెచ్చరించారు.