Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిస్‌బేన్: ఒక విమాన ప్రయాణికుడు ఫుల్‌గా మద్యం సేవించాడు. ఆపై దుస్తులు విప్పి విమానంలోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. న్యూజిల్యాండ్‌కు చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ బుధవారం బాలి నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌కు విమానంలో ప్రయాణించాడు. అయితే ఆ వ్యక్తి విమానంలో అతిగా మద్యం సేవించాడు. బ్రిస్‌బేన్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయ్యే ముందు తన సీటులో కూర్చొన్న అతడు దుస్తులు విప్పి మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమాన సిబ్బంది అతడ్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు అప్పగించగా అరెస్ట్ చేశారు. కాగా, ఆరు గంటల విమాన ప్రయాణంలో ఆ వ్యక్తి చాలా వైన్ బాటిళ్లు ఖాళీ చేశాడని, ఆపై విమానంలో అతిగా ప్రవర్తించాడని ఆస్ట్రేలియా పోలీసులు ఆరోపించారు. ఇలాంటి ప్రవర్తనకు ఎటువంటి కారణం లేదన్నారు. ఆస్టేలియా విమానాశ్రయంలో ఎలాంటి చట్టవిరుద్ధమైన ప్రవర్తనను సహించబోమన్నారు. ఈ మేరకు కోర్టులో వాదించడంతో బ్రిస్‌బేన్ కోర్టు ఆ వ్యక్తికి 12 నెలలు జైలు శిక్ష విధించింది.