Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. నల్లగొండ అర్జాలభావిలో తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడన్స్‌లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి అబ్జర్వర్, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో తీసుకురానున్నట్లు తెలిపారు.
కౌంటింగ్‌కు మూడంచెల భద్రతను కల్పించామని, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో పటిష్ట భద్రత కల్పించినట్లు చెప్పారు. 21 టేబుళ్లపై 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ర్యాండమ్‌గా ఐదు వీవీప్యాట్లలోని స్లిప్స్‌ను లెక్కించనున్నట్లు తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాలను స్క్రీన్లపై ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 3న మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా.. 298 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయని, 93.13 పోలింగ్ శాతం నమోదైందని వికాస్ రాజ్ తెలిపారు. మరో 680 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు.