Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండోనేషియాలో కొరియన్ బ్యాండ్ ప్రదర్శనలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు ముంది ఫ్యాన్స్ స్పృహ తప్పిన తప్పిపడిపోవడంతో కొరియా పాప్ బ్యాండ్ ఎన్‌సీటీ 127 ఇండోనేషియాలో తమ షోను అర్థాంతరంగా నిలిపేసింది. ఇండోనేషియాలో వీళ్ల బ్యాండ్ మొదటి ప్రదర్శన కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాజధాని జకర్తాలో రాత్రి 7 గంటలకు షో మొదలైంది. రెండు గంటల పాటు పాప్ గీతాలు, ఫ్యాన్స్ ఈలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే, ఆ టైంలోనే కొందరు తమ అభిమాన సింగర్‌లను చూడ్డానికి స్టేజీకి దగ్గరకు రావడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా అందరూ తోసుకొని రావడంతో స్టేజీ దగ్గర ఏర్పాటు చేసిన భారీకేడ్లు కిందపడ్డాయి. దాంతో అదుపుతప్పి ఫ్యాన్స్ ఒకరిమీద ఒకరు పడ్డారు. ఈ ఘటనలో 30 మంది వరకు స్పృహ తప్పి కింద పడిపోయారు. దాంతో, మరింత మందికి ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకు షోని ఆపి వేయాలనుకున్నారు నిర్వాహకులు. ఈ విషయం తెలిసిన వెంటనే షోని నిలిపివేసింది పాప్ బ్యాండ్.