Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరవతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షోపై నందిగామలో జరిగిన దాడి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందంటూ వచ్చిన వార్తలపై వైసీపీ కీలక నేత, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సందించారు. చంద్రబాబు, పవన్ లు రాష్ట్రంలో లేని కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఆయన వ్యకం చేశారు. ఈ సందర్భంగా పవన్ ఇంటి వద్ద రెక్కీ జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ తాగుబోతులు గొడవ చేస్తే పవన్ ఇంటిపై రెక్కీ జరిగందంటూ జనసేన ఆరోపిస్తోందని ఆయన సెటైర్లు సంధించారు. చంద్రబాబు రోడ్ షోపై జరిగిన దాడిని ప్రస్తావించిన నాని గులకరాయితో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిందట అని సెటైర్ వేశారు. చంద్రబాబు తనపై తానే గులకరాయి వేయించుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. టీడీపీ, జనసేనలు డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేఏ పాల్ ను మించి హడావిడి చేసేందుకు ఇప్పటంలో పవన్ ప్రయత్నించారన్నారు. విపక్షాలు ఇప్పటిదాకా ఒక్క నిర్మాణాత్మకమైన సలహా అయినా ఇచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు.