Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికారాబాద్ జిల్లా: పరిగి మండలంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కన్న కొడుకు తల్లిని తీవ్రంగా గాయపరిచి, తండ్రిని హత్య చేశాడు. నస్కల్ గ్రామానికి చెందిన మహేష్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం నిత్యం కుటుంబసభ్యులను వేధించేవాడు. శనివారం తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. మొదట తల్లిపై దాడి చేశాడు. అనంతరం మల్లయ్య (65) తలపై కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలికి చేరుకుని మల్లయ్య మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన మహేష్ తల్లిని ఆస్పత్రికి పంపారు. నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మహేష్ గంజాయితో పాటు పలు వ్యసనాలకు బానిసగా మారి నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు.