Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితం మరికాసేపట్లో వెలువడనుంది. నేటి ఉదయం 8 గంటలకు మొదలైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు 11 గంటల సమయానికంతా 4 రౌండ్లు పూర్తి చేసుకుని... 5వ రౌండ్ కు చేరుకుంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుండగా... 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లిపోయారు. అంతకుముందు... రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే...కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలేమీ కనిపించకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే 4 రౌండ్లలోనే రెండు రౌండ్లలో ఆదిక్యం కనబరచిన బీజేపీ...నాలుగో రౌండ్ లో వెనుకబడిపోయింది. 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత టీఆర్ఎస్ కు 714 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు మొత్తం బీజేపీకి పట్టున్న చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లలెక్కింపే కావడం గమనార్హం. తమకు పట్టున్న మండలంలోనే మెజారిటీ రాకపోవడంతోనే కోమటిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి లీడ్ లో ఉన్న టీఆర్ఎస్ కు 26,443 ఓట్లు రాగా... బీజేపీకి 25,730 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 7,380 ఓట్లు, బీఎస్పీకి 907 ఓట్లు వచ్చాయి.