Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యత కొనసాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కాగా... 11.45గంటలకు 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఓట్ల లెక్కింపులో 2, 3 వ రౌండ్ లు మినహా మిగిలిన 3 రౌండ్లలో ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్... 5వ రౌండ్ పూర్తి అయ్యేసరికి ఆ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఏకంగా 1,430 ఓట్ల మేర ఆధిక్యత లభించింది. తొలి 4 రౌండ్లు చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్ల లెక్కింపు జరగగా... 5వ రౌండ్ నుంచి సంస్థాన్ నారాయణపూర్ మండలానికి చెందిన ఓట్ల లెక్కింపు మొదలైంది. కాసేపటి క్రితమే 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. టీఆర్ఎస్ కు 1,430 ఓట్ల ఆధిక్యత లభించింది. 5వ రౌండ్ పూర్తి అయ్యేసరికి టీఆర్ఎస్ కు 32,405 ఓట్లు, బీజేపీకి 30,975 ఓట్లు, కాంగ్రెస్ కు 10,055 ఓట్లు, బీఎస్పీకి 1,237 ఓట్లు వచ్చాయి. ఫలితంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ పై టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 1,430 ఓట్ల ఆధిక్యత సాధించారు.