Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడిలైడ్ :టీ -20 ప్రపంచ కప్‌లో భాగంగా 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీ -20 ప్రపంచ కప్ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. పాకిస్తాన్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ 32 పరుగులు చేయగా, బాబర్ ఆజం 25 పరుగులు చేసి అవుటయ్యారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేనాటికి 127 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ నజ్మల్ హసన్ శాంతో 54 పరుగులు చేయగా లిటన్ దాస్ 10 పరుగులు, సౌమ్య సర్కార్ 20, ఆసీఫ్ హుస్సేన్ 24 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్ రెండు వికెట్లు, హారీష్ రావుఫ్, ఇఫ్తికర్ అహ్మెద్ చెరో వికెట్ సాధించారు.