Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లూరి సీతారామరాజు: వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఆదివారం తిరిగి పునఃప్రారంభమైంది. అధికారులు అనుమతి ఇచ్చారని ఏపీ టూరిజం టోటింగ్ అసిస్టెంట్ మేనేజర్ గంగబాబు ఈ మేరకు తెలిపారు. గండిపోశమ్మ ఆలయం వద్ద ఉన్న రెండు పర్యాటక బోట్లలో 106 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. గోదావరి నదిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండల విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి కలుగుతుంది.