Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తూరు: రామ కుప్పం మండలం, పీఎం తండాలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. రాగి, వరి పంటలను తిని.. తొక్కి పంటను నాశనం చేశాయి. ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నా.. అటవిశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల వైపు గానీ, దెబ్బతిన్న పంట పొలాలను చూడడానికి ఏ ఒక్క అధికారి రాలేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని పీఎం తండా గ్రామస్తులు డిమాండ్ చేశారు.