Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశించినంత ఫలితం రాకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2100, రెండో రౌండ్‌లో 1532, మూడో రౌండ్‌లోనూ 1500 పైచిలుకు ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.