Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫ్రికాదేశం: టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం విక్టోరియో సరస్సులో కూలిపోయింది. విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో, ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోవడంతో వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది 26 మందిని కాపాడారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అధికారులు స్థానిక మత్స్యకారుల సాయంతో విమాన ప్రయాణికుల కోసం గాలిస్తున్నారు. విమానం తోక భాగం మినహా విమానం మొత్తం సరస్సులో మునిగిపోయినట్లు తెలుస్తుంది.