Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్‌బోర్న్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఖాతాలోకి అత్యంత అరుదైన ఘనత వచ్చి చేరింది. తాజాగా, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్య విరుచుకుపడ్డాడు. 244 స్ట్రైక్ రేట్‌తో 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. రోహిత్ శర్మ, కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తించి జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డాడు.
సూర్యకుమార్ 28 మ్యాచుల్లో 28 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 1026 పరుగులున్నాయి. ఈ ఏడాది సూర్య తర్వాతి స్థానాల్లో మహ్మద్ రిజ్వాన్ (924), విరాట్ కోహ్లీ (731), పాథుమ్ నిశ్శంక (713), సికందర్ రజా (701) ఉన్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఓవరాల్‌గా సూర్యది రెండో స్థానం. ఈ జాబితాలో పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నాడు.