Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: మెట్రో స్టేషన్‌లో అందరి ఎదుటే ట్రాక్‌పై బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్రో స్టేషన్‌లో ఆ వ్యక్తి దుశ్చర్యను చిత్రీకరించిన వ్యక్తి ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో డి.ఎమ్.ఆర్.పి స్పందిప్తూ మెట్రో రైల్వే వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయాణికులందరూ సహకరించాలని, ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని మెట్రో స్టేషన్లలోనూ టాయిలెట్లు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలిని, ఇలాంటి ఘటనలను ఎవరైనా గమనిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా మెట్రో స్టేషన్ సిబ్బందికి అయినా కంప్లైంట్ ఇవ్వాలని డి.ఎమ్.ఆర్.పి పేర్కొంది.