Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయ దుందుభి మ్రోగించారు. ఈ నేపథ్యంలో మునుగోడు చైతన్యానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఈ ఆయన మాట్లాడుతూ నవంబర్ 3న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టంకట్టి కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి పార్టీ తరఫున ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.