Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముంబైలోని అంధేరి ఈస్ట్‌కు జరిగిన ఉప ఎన్నికలో విచిత్రం జరిగింది. అక్కడ ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే భార్య రుతుజ లట్కే విజయం సాధించగా రెండో స్థానంలో ‘నోటా’ నిలిచింది. మొత్తం 86,570 ఓట్లలో రుతుజకు 66,530 ఓట్లు రాగా, నోటాకు ఏకంగా 12,806 ఓట్లు పడ్డాయి. అంటే 14.79 శాతం ఓట్లు పోలయ్యాయి. బరిలో ఉన్న మిగతా వారిలో ఎవరికీ 1600కు మించి ఓట్లు రాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రాలో శివసేన రెండుగా చీలిపోయింది. ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి రుతుజ బరిలో నిలవగా బీజేపీ, ఏక్‌నాథ్ షిండే వర్గం తమ అభ్యర్థిని ఆ తర్వాత ఉప సంహరించుకుంది. ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూడా రుతుజకే మద్దతు ఇవ్వడంతో పోటీ ఏకపక్షం అయింది. కాగా, ఉద్ధవ్ థాకరే శివసేనకు ఎన్నికల కమిషన్ ‘కాగడా’ గుర్తు కేటాయించింది. ఆ గుర్తుతో బరిలోకి దిగిన ఉద్దవ్ థాకరే శివసేన తొలి పోరులోనే విజయం సాధించింది.