Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణే: పూణే-బెంగళూరుఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. పూణే విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఎయిర్ ఏషియా విమానం ఏ 320 విమానం టేకాఫ్ అయ్యే చివరి క్షణంలో సాంకేతిక లోపంతో విమానాశ్రయం బేకు తిరిగి వచ్చింది. ఏ320 విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియలేదు. ‘‘పూణే నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా ఇండియా ఫ్లైట్ ఐ5-1427 సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ రద్దు చేసి బేకి తిరిగి వచ్చింది’’ అని ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.పూణె నుంచి బయలుదేరిన బెంగళూరు విమానం సాంకేతిక లోపం కారణంగా బేకు తిరిగి వచ్చినట్లు ఎయిర్ ఏషియా ఇండియా ఒక ప్రకటనలో ధృవీకరించింది. అంతకుముందు ఎయిర్ ఏషియా విమానం తిరిగివచ్చిన ఘటనపై ఒక విమాన ప్రయాణికుడు ట్వీట్ చేశారు. ‘‘కొన్ని కారణాల వల్ల ఎయిర్ ఏషియా పూణే-బెంగళూరు ఎయిర్‌బస్ ఏ-320 విమానం పూణే విమానాశ్రయంలో అకస్మాత్తుగా టేకాఫ్ ను నిలిపివేశారు.’’ అని ఓ విమాన ప్రయాణికుడు ట్వీట్ చేశారు. ఈ సాంకేతిక లోపంపై ఎయిర్ ఏషియా అధికార ప్రతినిధి ఇతర వివరాలను పంచుకోలేదు.