Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ నియామక పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. మొత్తం 16 జిల్లాల్లో 56 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ పద్ధతిలో టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షను నిర్వహిస్తున్నది. మొత్తం 24 పోస్టులకుగాను 16,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.