Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం నిర్వహించే కార్యకలాపాలు సోమవారం ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. వాస్తవానికి ఆయన మంగళవారం పదవీ విమరణ చేయాల్సి ఉన్నా ఆ రోజు సెలవు కావడంతో ముందుగానే నిర్వహించనున్నారు. సంప్రదాయం ప్రకారం చివరి రోజున తదుపరి ప్రధాన న్యాయమూర్తితో కలిసి ధర్మాసనంపై ఆశీనులు కావాల్సి ఉంది. తొలిసారిగా ఆగస్టు 26న అప్పటి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ చేసినప్పుడు చివరి రోజు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఇప్పుడు ఇదో సంప్రదాయంగా మారింది.