Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓల్డ్‌మలక్‌పేట పద్మానగర్ బస్తీలో ఆదివారం ఉదయం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. తూర్పు మండలం డీసీపీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, సుల్తాన్‌బజార్, మలక్‌పేట ఏసీపీలు దేవేందర్, వెంకటరమణ, చాదర్ ఘాట్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్‌రెడ్డితోపాటు దాదాపు 5వందల మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రౌడీషీటర్ కమల్‌సింగ్, 10 మంది అనుమాని తులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 45 ద్విచక్ర వాహనా లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డొమెస్టిక్ నుంచి కమర్షియల్ సిలిండర్లకు అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్‌కు ఉపయోగించే 7 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసు కుని నిర్వాహకుడు రజాక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలో అక్రమం గా మద్యం నిల్వచేసి బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నట్లుగా గుర్తించి 65 మద్యం సీసా లను స్వాధీనం చేసుకున్నారు. జంతువుల కొవ్వు నుంచి తయారు చేసే 75 కిలోల కల్తీ ఆయిల్‌ను సీజ్ చేశారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయ నున్నట్లు తూర్పు మండలం అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.