Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను, ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయిన విషయం తెలిసిందే. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదల (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్)కు 10 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. వీరికి 10 శాతం కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇందులో ఎలాంటి వివక్ష లేదని చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలవరించింది. ఈ రిజర్వేషన్లను నలుగురు జడ్జిలు సమర్థించగా జస్టిస్ రవీంద్రభట్ వ్యతిరేకించారని తెలుస్తుంది.